

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కార్మికుల సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు తన కుటుంబ సభ్యులే కాకుండా ఈ ప్రభుత్వ భాగస్వాములని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయని, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మిగతా అంశాలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. సంస్థ పురోగతితో పాటు కార్మికుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ, తాను మీ మంత్రిగానే కాక కుటుంబ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా ఎలాంటి సమస్య అయినా చర్చించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆందోళనలు, ప్రేరేపిత నిరసనలు నివారిస్తూ సంస్థను కాపాడుకోవాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సూచన మేరకు కార్మికులు తమ సమస్యలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చని, తమ తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పురోగతి, ప్రయాణికుల సౌకర్యం అనే మూడు ఎజెండాలపై పనిచేస్తోందని తెలిపారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!