

‘తెలంగాణ రైజింగ్–2047’ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ దార్శనిక పత్రం ప్రజల సూచనలతో, దేశీ–విదేశీ నిపుణుల భాగస్వామ్యంతో సిద్ధమైందని ప్రభుత్వం తెలిపింది.
సీఎం ప్రవేశపెట్టిన లక్ష్యాలు 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధ్యమేనని పలువురు జాతీయ, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా మారే అవకాశముందని వారు పేర్కొన్నారు.
సమ్మిట్ లో ఆనంద్ మహీంద్రా, దువ్వూరి సుబ్బారావు, అరవింద్ సుబ్రమణియన్, సుమన్‌బేరీ, మురళీధరన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. టోనీ బ్లెయిర్, రఘురాం రాజన్ ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ ప్రయత్నాలు, విజన్ పత్రం దిశ, ప్రజల భాగస్వామ్యాన్ని వారు అభినందించారు.
విజన్ డాక్యుమెంట్లో మూడు ప్రాంతాల కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్-అగ్రి అభివృద్ధికి ప్రత్యేక వ్యూహం రూపొందించారు. మౌలిక వసతులు, పారదర్శక పాలన, పెట్టుబడుల పెంపు, విద్య–ఆరోగ్యం, మహిళలు–యువత–రైతుల సంక్షేమం, పరిశోధనా సంస్థల ఆకర్షణ, డిజిటల్ గవర్నెన్స్ వంటి అంశాల పై స్పష్టమైన ప్రణాళికను ప్రవేశపెట్టారు.
భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న ప్రాజెక్టుల్లో
భారత్ ఫ్యూచర్ సిటీ
మూసీ పునరుజ్జీవనం
డ్రైపోర్టు
గ్రీన్‌ఫీల్డ్ హైవే
రీజినల్ రింగ్ రోడ్డు
రింగ్ రైలు, బుల్లెట్ రైలు మార్గాలు
ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
సమ్మిట్ లో పలు కంపెనీలు పెట్టుబడుల కోసం ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, సమతుల అభివృద్ధి, అవకాశాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడం ఈ విజన్ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!