
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో రాష్ట్ర CMO ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ భారీ డిజిటల్ మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం ఈ పేజ్ 30 లక్షల ఫాలోవర్లను దాటుతూ, దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్గా నిలిచింది. విజయ్ సీఎం అయ్యే ముందు ఈ ఖాతాకు కేవలం నాలుగు లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం.
విజయ్ సినీ క్రేజ్ రాజకీయ రంగంలోనూ ఎంత ప్రభావం చూపుతోందో ఈ వృద్ధి స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా యువత తమిళనాడు ప్రభుత్వ ప్రకటనలు, అప్డేట్స్ను సోషల్ మీడియా ద్వారా ఫాలో అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ సమయంలో ఇంత భారీ స్థాయిలో ఆర్గానిక్ గ్రోత్ సాధించిన రాజకీయ పేజీలు దేశంలో చాలా అరుదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!