28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీలిమిటేషన్‌ బిల్లును అడ్డుకుంటాం - కాంగ్రెస్‌

Writer: Pooja 05:43 AM, 28 నవంబర్, 2026
డీలిమిటేషన్‌ బిల్లును అడ్డుకుంటాం - కాంగ్రెస్‌

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని ఆరోపించింది. ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ నెల 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ నివాసంలో పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. రాబోయే 25 ఏళ్లపాటు లోక్‌సభ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం కాకుండా, డీలిమిటేషన్‌ ద్వారా రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంటు ఇప్పటికే చట్టం చేసినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దాని అమలును మూడేళ్లుగా ఆలస్యం చేస్తున్నారని జైరాం రమేశ్‌ ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేందుకే డీలిమిటేషన్‌ బిల్లును తీసుకొస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ పాత్రపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతిన్నదని ఆరోపిస్తూ, ఈ బిల్లును తగిన రీతిలో అడ్డుకుంటామని ప్రకటించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉపనాయకుడు గౌరవ్‌ గొగోయ్‌ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా ఎవరు ఓటు వేయాలో నిర్ణయించేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఇప్పుడు డీలిమిటేషన్‌ ద్వారా ఎక్కడ ఓటు వేయాలో నిర్ణయించాలని చూస్తోందని విమర్శించారు. ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ తన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు విప్‌ జారీ చేసింది. ఎంపీలంతా తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని, ఆదివారం ఉదయం 10 గంటల్లోపు ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశించింది.

మరోవైపు, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందేందుకే బీజేపీ డీలిమిటేషన్‌ బిల్లును తీసుకొస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ బిల్లు పేరుతో బీజేపీ పెద్ద తప్పు చేస్తోందని విమర్శించారు. అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, యూపీలో అధికారం కోల్పోతామనే భయంతోనే ఈ బిల్లును తెస్తోందని ఆయన ఆరోపించారు. డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, శనివారం ఉదయం 11.30 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఈ సమావేశానికి డీఎంకేను కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు. మరోవైపు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన కూడా తమ ఎంపీలకు విప్‌ జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

స్పెయిన్ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పనున్న ముందస్తు ఎన్నికలు

స్పెయిన్ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పనున్న ముందస్తు ఎన్నికలు

ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ట్యాగ్లు
డీలిమిటేషన్ బిల్లుమహిళా రిజర్వేషన్లుకాంగ్రెస్ పార్టీసోనియాగాంధీఅఖిలేశ్ యాదవ్పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
జనరల్

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి
సినిమాలు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే
రాజకీయాలు

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ
సినిమాలు

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్
రాజకీయాలు

నియోజకవర్గాల పునర్విభజనపై బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించిన మహేష్ గౌడ్

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా
టెక్నాలజీ

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?
సినిమాలు

అనిల్ రావిపూడి కలల ప్రాజెక్ట్ ఇదేనా?

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?
సినిమాలు

వారణాసి విడుదలపై జక్కన్న కీలక అప్డేట్?

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?
గాసిప్స్

తెలుగు హీరోలపై ఫోకస్ పెట్టిన జీతూ మాధవన్?

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?
సినిమాలు

అలియాస్ రుక్మిణితో వృషకర్మకు గట్టి పోటీ?

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?
గాసిప్స్

యానిమల్ పార్క్‌పైనే సందీప్ రెడ్డి దృష్టి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!