
సినిమాలు

పశ్చిమ బెంగాల్లో మొదటిసారి భాజపా ప్రభుత్వం ఏర్పడింది. భాజపా నేత సువేందు అధికారి ఈరోజు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఘన కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
సువేందు అధికారి 55 ఏళ్ల వయసులో బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో తృణమూల్ కాంగ్రెస్లో కీలక నేతగా పని చేసి, 2020లో భాజపాలో చేరారు. 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీపై నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల్లో విజయాలు సాధించి సంచలనం సృష్టించారు. ఆయనతో పాటు పలువురు భాజపా నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!