21, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సొంతూరిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు..

Writer: Harika S 11:42 PM, 20 అక్టోబర్, 2026
సొంతూరిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు..

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల ఆశీర్వచనం స్వీకరించిన ముఖ్యమంత్రి గ్రామస్థులను ఆప్యాయంగా పలకరిస్తూ పండుగ ఆనందాన్ని వారితో పంచుకున్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కోట మైసమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి కాలినడకన జమ్మి చెట్టు వద్దకు చేరుకుని సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలు, సంప్రదాయ ఆచారాలు, గ్రామస్థుల ఆత్మీయ పలకరింపులతో కొండారెడ్డిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ

రాజకీయాల్లోకి ధనుష్? స్వాగతిస్తామన్న విజయ్ పార్టీ టీవీకే

రాజకీయాల్లోకి ధనుష్? స్వాగతిస్తామన్న విజయ్ పార్టీ టీవీకే

యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ దసరా వేడుకలు.. వాహన, ఆయుధ పూజలు

ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ దసరా వేడుకలు.. వాహన, ఆయుధ పూజలు

చంద్రబాబు కీలక ఆదేశాలు.. రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలి

చంద్రబాబు కీలక ఆదేశాలు.. రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలి

నగరి మున్సిపల్ ఎన్నికల వివాదం.. కలెక్టర్‌కు ఆధారాలు సమర్పించిన రోజా

నగరి మున్సిపల్ ఎన్నికల వివాదం.. కలెక్టర్‌కు ఆధారాలు సమర్పించిన రోజా

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ముఖ్యమంత్రిదసరా 2026విజయదశమికొండారెడ్డిపల్లికల్వకుర్తిరావణ దహనంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌పై సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్లపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్‌పై సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్లపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

సొంతూరిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు..
రాజకీయాలు

సొంతూరిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు..

స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ
రాజకీయాలు

స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించండి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ

జింబాబ్వేపై భారత మహిళల జట్టు క్లీన్ స్వీప్.. మూడో టీ20లో 92 పరుగుల ఘన విజయం
క్రీడలు

జింబాబ్వేపై భారత మహిళల జట్టు క్లీన్ స్వీప్.. మూడో టీ20లో 92 పరుగుల ఘన విజయం

రాజకీయాల్లోకి ధనుష్? స్వాగతిస్తామన్న విజయ్ పార్టీ టీవీకే
రాజకీయాలు

రాజకీయాల్లోకి ధనుష్? స్వాగతిస్తామన్న విజయ్ పార్టీ టీవీకే

ఆసియా పారా గేమ్స్ 2026లో నిషాద్ కుమార్ చరిత్ర.. ఒకే ఎడిషన్‌లో రెండు స్వర్ణాలు
క్రీడలు

ఆసియా పారా గేమ్స్ 2026లో నిషాద్ కుమార్ చరిత్ర.. ఒకే ఎడిషన్‌లో రెండు స్వర్ణాలు

మెగా ఇంట్లో పెళ్లి బాజాలు.. త్వరలో పెళ్లికొడుకు కానున్న స్టార్ హీరో?
గాసిప్స్

మెగా ఇంట్లో పెళ్లి బాజాలు.. త్వరలో పెళ్లికొడుకు కానున్న స్టార్ హీరో?

‘స్పిరిట్’ డేట్‌ను లాక్ చేసిన దిల్ రాజు..
సినిమాలు

‘స్పిరిట్’ డేట్‌ను లాక్ చేసిన దిల్ రాజు..

తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచే భారతీయ సీఈఓ.. 996 వర్క్ కల్చర్‌కు వ్యతిరేకం
బిజినెస్

తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచే భారతీయ సీఈఓ.. 996 వర్క్ కల్చర్‌కు వ్యతిరేకం

నగరి మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అభ్యర్థి
జనరల్

నగరి మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ తిరస్కరణపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అభ్యర్థి

శర్వానంద్ ‘భోగి’ నుంచి భావోద్వేగ గీతం విడుదల..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ నుంచి భావోద్వేగ గీతం విడుదల..

భారత్ చమురు శుద్ధిలో సూపర్ పవర్.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్ చమురు శుద్ధిలో సూపర్ పవర్.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!