
న్యూస్

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ విచారణను ఈ నెల 19 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సంబంధిత అంశాలపై మరింత పరిశీలన అవసరమని పేర్కొంటూ తదుపరి విచారణ తేదీని నిర్ణయించారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
ఇదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద, స్పీకర్ తీర్పును కోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!