

తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి ధరలపై శాసనమండలి భాజపా పక్ష నేత సోము వీర్రాజు ప్రశ్నలు లేవనెత్తారు. ఇంట్లో వాడే నాణ్యమైన నెయ్యి రూ.2 వేల వరకు ఉంటే, దేవాలయ ప్రసాదానికి రూ.329కే నెయ్యి ఎలా వస్తుందో మాజీ సీఎం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ తక్కువ ధరకు నెయ్యి కొనడం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దేవాలయాల్లో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు.
సభ నిర్వహణపై కూడా సోము వీర్రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా సభ సజావుగా సాగడం లేదని, బడ్జెట్‌పై చర్చలు వాయిదా పడుతున్నాయని విమర్శించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాల కోసం ఛైర్మన్‌ను కలవడానికి వెళ్లగా తనపై దాడికి ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. సభలో ప్రశ్నల పేరుతో ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇవ్వడం, మంత్రులకు తక్కువ సమయం కేటాయించడం సరైన విధానం కాదని పేర్కొంటూ, ఇవి ప్రశ్నలా లేక ప్రసంగాలా అన్న సందేహం వ్యక్తం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!