
గాసిప్స్

నందినగర్‌లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. కేసీఆర్ ఇంటి రెండో అంతస్తులోనే విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. విచారణ గదిలోకి కేసీఆర్ ఒక్కరినే అనుమతించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నివాస ప్రాంగణంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు.
అయితే కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీష్ రావు, కేటీఆర్, సంతోష్‌లకు మాత్రమే పరిమిత అనుమతి ఇచ్చారు. విచారణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ విచారణకు సంబంధించిన వివరాలు అధికారికంగా తరువాత వెల్లడయ్యే అవకాశముంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!