
న్యూస్

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావు కు సిట్ నోటీసులు అందజేసింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
అదే విధంగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయన్ను కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!