

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత తీవ్ర స్థాయికి చేరింది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. శనివారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి కు చెందిన అనుచరులు జనార్దన్ రెడ్డి ఇంటి ముందు బ్యానర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా, ఈ ఘటన ఘర్షణకు దారి తీసింది.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రంగా మారి, చివరకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రతను పెంచారు.
ఈ ఘటన పై స్పందించిన గాలి జనార్దన్ రెడ్డి, తనను హత్య చేయాలనే ఉద్దేశంతో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భరత్ రెడ్డి ఖండించారు. తమ పార్టీ కార్యకర్త మృతికి గాలి జనార్దన్ రెడ్డే బాధ్యుడని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనతో బళ్లారి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతూ, ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.




.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!