
క్రీడలు

పిఠాపురం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పించాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గంలో వర్మ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం పెద్ద చర్చగా మారింది. ఈ వ్యవహారం కూటమిలో అసంతృప్తికి దారితీసినట్లు సమాచారం.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమైన సమయంలో వర్మ వ్యవహారం ప్రస్తావనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వర్మ తరచూ వివాదాలకు కారణమవుతున్నారని పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం పిఠాపురం బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!