

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన కీలక రహస్య దౌత్య పత్రం బయటకు రావడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికాకు చెందిన పరిశోధనాత్మక మీడియా సంస్థ ‘డ్రాప్సైట్’ విడుదల చేసిన ‘సైఫర్’ పత్రంలో, 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు అమెరికా అధికారులతో పాక్ రాయబారి కీలక సమావేశం నిర్వహించినట్లు వెల్లడైంది. ‘కేబుల్ ఐ-0678’ పేరుతో గుర్తించిన ఈ పత్రంలో, ఇమ్రాన్ ఖాన్ అధికారంలో కొనసాగితే పాకిస్థాన్-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని చర్చ జరిగినట్లు సమాచారం.
ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే తనపై విదేశీ కుట్ర జరిగిందని, స్వతంత్ర విదేశాంగ విధానం కారణంగానే తన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ వచ్చారు. రష్యా, చైనా అంశాల్లో అమెరికాతో విభేదించడం వల్లే తనను పదవి నుంచి తొలగించారని ఆయన పేర్కొన్నారు. తాజా లీక్‌తో పీటీఐ పార్టీ మరియు ఇమ్రాన్ మద్దతుదారులు తమ ఆరోపణలకు బలమైన ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పాక్ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!