

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను మభ్యపెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బు, మద్యం, చీరలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, సంబంధిత వీడియోలను సీఈవోకు అందజేశారు.
అలాగే, యూసుఫ్‌గూడా పోలింగ్ కేంద్రం సమీపంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను వెంటనే తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెమటలు పట్టే పరిస్థితి వచ్చింది. రెండేళ్లుగా ఆరు గ్యారెంటీలపై సమీక్ష చేయని సీఎం, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. హరీష్ రావు మాట్లాడుతూ, “రేవంత్ ఓటమిని ముందుగానే అంగీకరించారు. అందుకే గ్యారెంటీల సమీక్ష పేరుతో డ్రామా ఆడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ప్రజలు వివేకంగా ఓటు వేస్తారు” అన్నారు. అదనంగా, బైపోల్స్‌లో వేల ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు ఎలా వెలిశాయో విచారించాలని కోరారు. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, సీఆర్పీ బలగాలను విధుల్లో వినియోగించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (1)
హరీష్ వ్యాఖ్యలు రాజకీయ రంగంలో హీట్ పెంచాయి