
సినిమాలు

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన నివాసంలో అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు.
జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24న పార్టీని అధికారికంగా ప్రారంభించేందుకు నిర్ణయించారు. అదే రోజున పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం, విధివిధానాలను ప్రకటించనున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ముత్తురామలింగదేవర్ స్వస్థలమైన రామనాథపురం జిల్లా పశుంపొన్లో పార్టీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!