
టెక్నాలజీ

ముంబయి మేయర్ పదవికి అధికార మహాయుతి కూటమి బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డేను ఖరారు చేసింది. పార్టీ అగ్ర నాయకత్వంతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ నేత అమిత్ సతమ్ తెలిపారు. డిప్యూటీ మేయర్ పదవికి షిండే వర్గానికి చెందిన సంజయ్ ఘాడీని ఎంపిక చేశారు.
ఈ విజయంతో ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ పాలన బీజేపీ షిండే కూటమి చేతుల్లోకి వెళ్లింది. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేశాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. మొత్తం 227 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇందులో బీజేపీ 89, శివసేన (షిండే) 29 స్థానాలు దక్కించుకున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!