

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ను కలిసి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం రక్షణ శాఖ భూముల బదలాయింపుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీల బదిలీ వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్‌లో అభివృద్ధి చెందనున్న భారత వాయుసేన విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో విస్తరించాలని ముఖ్యమంత్రి కోరారు. ఎయిర్ ఫోర్స్ టెర్మినల్‌తో పాటు పౌర విమానయాన టెర్మినల్, కార్గో సేవలు, ఎంఆర్ఓ (MRO), హ్యాంగర్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యప్రాచ్య పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్‌లైన్స్‌కు అనుకూల కేంద్రంగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే అవకాశాలపై కూడా చర్చించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!