

హైదరాబాద్‌లో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్‌ను ఎంచుకున్న సాఫ్రాన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సదుపాయం దేశంలోనే తొలి LEAP ఇంజిన్ MRO సెంటర్‌గా నిలవడం, రూ.1,300 కోట్ల పెట్టుబడి, వేలాది నైపుణ్య ఉద్యోగాల సృష్టి రాష్ట్ర ఏరోస్పేస్-రక్షణ రంగానికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే M88 మిలిటరీ ఇంజిన్ MRO కి కూడా శంకుస్థాపన చేశారు.
తెలంగాణ ఏరోస్పేస్ మరియు రక్షణ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. 25 మంది గ్లోబల్ కంపెనీలు, 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు, అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఇవి సాఫ్రాన్, బోయింగ్, ఎయిర్‌బస్, టాటా వంటి సంస్థల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చాయని తెలిపారు. గత సంవత్సరం తెలంగాణ ఏరోస్పేస్ ఎగుమతులు రెట్టింపు కావడం, తొలిసారి ఫార్మా ఎగుమతులను దాటడం రాష్ట్ర పురోగతికి నిదర్శనమన్నారు.
డిసెంబర్ 8–9 న జరగనున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తూ, 2035 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. బెంగళూరు–హైదరాబాద్ ను డిఫెన్స్ & ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేసారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!