

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తొలి రోజునే భారీ స్థాయిలో పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీలో జరిగిన ఈ సమ్మిట్‌లో మొత్తం రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, టెక్స్టైల్ వంటి అనేక రంగాల్లో కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
ప్రధాన పెట్టుబడి ఒప్పందాలు:
బ్రుక్‌ఫీల్డ్–యాక్సిస్ వెంచర్స్ కూటమి: రూ.75,000 కోట్లు – గ్లోబల్ R&D, డీప్‌టెక్ హబ్.
విన్ గ్రూప్: రూ.27,000 కోట్లు – పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా.
SIDBI: రూ.1,000 కోట్లు – స్టార్టప్స్‌కు పెట్టుబడులు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్: రూ.1,000 కోట్లు – ఇన్నోవేషన్ హబ్.
ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ: రూ.31,500 కోట్లు – సోలార్, విండ్ ప్రాజెక్టులు.
మెఘా ఇంజినీరింగ్: రూ.8,000 కోట్లు – సోలార్, EV, పంప్డ్ స్టోరేజ్.
జీఎంఆర్ గ్రూప్: రూ.15,000 కోట్లు – కార్గో, ఏరోస్పేస్ విస్తరణ.
అపోల్ మైక్రో సిస్టమ్స్: రూ.1,500 కోట్లు – డిఫెన్స్ తయారీ.
మిస్సైల్ భాగాలు, ఏరో ఇంజిన్ స్ట్రక్చర్లకు మరో రూ.1,500 కోట్ల ఒప్పందం.
MPL లాజిస్టిక్స్: రూ.700 కోట్లు.
TVS ILP: రూ.200 కోట్లు – లాజిస్టిక్స్ విస్తరణ.
హైడ్రోజన్–ఎలక్ట్రానిక్స్ విస్తరణ: రూ.7,000 కోట్లు.
సాహీటెక్ ఇండియా: రూ.1,000 కోట్లు – హైడ్రోటెక్ సొల్యూషన్స్.
కృష్ణా పవర్ యుటిలిటీస్: రూ.5,000 కోట్లు – స్టీల్ ప్లాంట్.
అల్ట్రా బ్రైట్ సిమెంట్స్ & రెయిన్ సిమెంట్స్: రూ.2,000 కోట్లు.
సీతారాం స్పిన్నర్స్: రూ.3,000 కోట్లు – టెక్స్టైల్ యూనిట్.
జీనియస్ ఫిల్టర్స్–షోలాపూర్ అసోసియేషన్: రూ.960 కోట్లు – పవర్ లూమ్ యూనిట్.
అంతర్జాతీయ, ప్రముఖ సంస్థల కీలక ప్రకటనలు:
ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్: రూ.41,000 కోట్లు – హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ మీడియా & స్మార్ట్ టెక్ హబ్.
రిలయన్స్ (వంతారా ప్రాజెక్ట్): ఆసియాలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ, జంతు సంక్షేమ కేంద్రం.
సల్మాన్ ఖాన్ వెంచర్స్: రూ.10,000 కోట్లు – టౌన్షిప్, ఫిల్మ్ & టీవీ స్టూడియో.
అథిరత్ హోల్డింగ్స్: రూ.4,000 కోట్లు – 25 CBG ప్లాంట్లు.
అపోలో గ్రూప్: రూ.800 కోట్లు – ఆధునిక మెడికల్ యూనివర్సిటీ, రీసెర్చ్ సెంటర్.
సూపర్‌క్రాస్ ఇండియా: అంతర్జాతీయ రేసింగ్ ట్రాక్, శిక్షణా కేంద్రం.
యూనివర్సిటీ ఆఫ్ లండన్ భాగస్వామ్యం: తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్.
ఈ భారీ పెట్టుబడులు తెలంగాణపై దేశీ–విదేశీ కంపెనీలు ఉంచుతున్న నమ్మకానికి సాక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్టే ప్రతి రూపాయి ఉపాధి అవకాశాలుగా, మౌలిక సదుపాయాలుగా మారేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
పరిశ్రమల వైవిధ్యం, అధునాతన రంగాల్లో పెట్టుబడులు తెలంగాణ సుస్థిర పారిశ్రామిక విధానాన్ని ప్రపంచానికి చూపుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!