
జనరల్

జనసేన పార్టీ అంతర్గత క్రమశిక్షణా అంశాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ఆయనపై పార్టీకి అందిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. రైల్వేకోడూరులోని ఓ హోటల్‌లో జరిగిన ఈ విచారణకు కమిటీ సభ్యులు హాజరై ఎమ్మెల్యే నుంచి వివరణలు సేకరించారు. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అరవ శ్రీధర్, కమిటీ ముందు హాజరై తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిపారు.
విచారణ మధ్యలోనే బయటకు వచ్చిన అరవ శ్రీధర్, తన వివరణ మొత్తం కమిటీకి వివరించానని చెప్పారు. ఆరోపణలపై పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్న ఆయన, మీడియాకు సమాచారం ఇస్తానని చెప్పి చివరకు మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ అంతర్గత విచారణ అంశం రాజకీయ చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!