

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోందని ఆరోపించిన ఆయన, రాబోయే రోజుల్లో దేశంలో భారీ ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, త్వరలో మరింత పెరుగుతాయని కూడా పేర్కొన్నారు.
మోడీ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమైందని రాహుల్ ఆరోపించారు. తక్కువ ధరకే ముడి చమురు కొనుగోలు చేసి లాభాలు ఆర్జిస్తున్న సంస్థలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని విమర్శించారు. విదేశీ పర్యటనలు, ఆర్థిక విధానాలపై కూడా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. అయితే ప్రధాని మోదీని “దేశద్రోహి”గా అభివర్ణించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!