

సీబీఎస్ఈలో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సమాధాన పత్రాల పునర్మూల్యాంకనం, రీటోటలింగ్ వంటి ప్రక్రియల పేరుతో విద్యార్థులపై భారాలు మోపుతూ వ్యవస్థ లాభం పొందుతోందని ఆయన విమర్శించారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తున్నందువల్లే ఇలాంటి తప్పిదాలు పెరుగుతున్నాయని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.100, రీటోటలింగ్కు రూ.100, ప్రశ్నకు రూ.25 వసూలు చేస్తూ విద్యార్థులపై ఆర్థిక భారం వేస్తున్నారని, ఒక్కో విద్యార్థి సుమారు రూ.2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రాహుల్ తెలిపారు. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన చెప్పారు. మరోవైపు విద్యాశాఖ పరిధిలో అగ్నిప్రమాదంపై జైరాం రమేశ్ ఆందోళన వ్యక్తం చేయగా, అది విద్యాశాఖ కార్యాలయంలో కాకుండా వేరే సంస్థలో జరిగిందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే రాజస్థాన్‌లో జరిగిన పార్టీ శిక్షణ శిబిరంలో రాహుల్, ప్రజలతో అనుసంధానం, అట్టడుగు స్థాయి పనితీరు, ముఖస్తుతి రాజకీయాలకు దూరంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!