

భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9 వ తేదీల్లో నిర్వహించబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు స్వయంగా ఆహ్వానం అందించనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు తదితరులు సమ్మిట్‌లో పాల్గొననున్నారు. ఆహ్వానాల నిర్వహణ, వసతుల ఏర్పాట్లు, శాఖల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేయబడింది. సమ్మిట్ కోసం ప్రత్యేక వెబ్సైట్ కూడా సిద్ధం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యాష్‌బోర్డ్ ద్వారా సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
సమ్మిట్ సిద్ధతలో భాగంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌ను వివిధ శాఖల మంత్రి, అధికారులు పరిశీలిస్తున్నారు. డిసెంబరు 2 వరకు పూర్తి విశ్లేషణతో నివేదికలు సమర్పించాలి. డిసెంబరు 3, 4 తేదీలలో ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిఎంవో అధికారులు నివేదికలను సమీక్షించి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు. డిసెంబరు 6 సాయంత్రం నాటికి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ పూర్తి సిద్ధం చేయబడనుంది. అన్ని శాఖల అధికారులు డాక్యుమెంట్ రూపకల్పనకు పూర్తి సమయం కేటాయించి, గ్లోబల్ సదస్సు ఏర్పాట్లలో సమన్వయాన్ని నిర్ధారించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!