
గాసిప్స్

రాజ్యాంగ పదవిలో కొనసాగుతూనే రాజకీయ డిబేట్లలో పాల్గొంటున్నారనే ఆరోపణలతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుపై జన భారత్ పార్టీ (JBP) రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును జేబీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ సమర్పించారు. ఈ అంశంపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం, ఫిర్యాదును తక్షణమే పరిశీలించి పిటీషనర్ నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
ఈ వ్యవహారంపై స్పందించిన జేబీపీ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్, డిప్యూటీ స్పీకర్‌పై చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. పిటీషన్లో పేర్కొన్న అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!