

రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల కవిత తిరుమల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటీవల గులాబీ పార్టీపై విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ప్రస్తావిస్తూ రాజకీయంగా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. బీసీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ఆమె, ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లనున్నారు.
ఈ నెల 5 వ తేదీన తిరుపతికి చేరుకుని కవిత, అక్కడి నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకోనున్నారు. 6 వ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె అయిన కవిత ఈ పాదయాత్ర చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి బయటపడిన తర్వాత ఆమె తిరుమల దర్శనం ప్రాధాన్యం సంతరించుకుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!