

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతిని భావితరాలకు చిరస్థాయిగా నిలిపేలా రాజధాని అమరావతిలో స్మృతి వనాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన 58 రోజుల త్యాగానికి గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆత్మార్పణ దిన కార్యక్రమంలో పాల్గొని, అమరజీవికి ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను సత్కరించారు.
పొట్టి శ్రీరాములు త్యాగంతోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, అనంతరం 1956 లో ఆంధ్రప్రదేశ్ అవతరించిందని సీఎం గుర్తుచేశారు. 2026 మార్చి 16 న ఆయన 125 వ జయంతిని పురస్కరించుకుని ఏడాది పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు, వచ్చే ఏడాది డిసెంబర్ 15 న 6.8 ఎకరాల్లో స్మృతి వనం, మ్యూజియంతో కూడిన 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!