
సినిమాలు

కవిత స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామాన్ని ఉపయోగించడంపై వివాదం మరింత ముదురుతోంది. పార్టీ అధికారిక ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన’ కూడా అదే సంక్షిప్త నామం కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మరోవైపు, ‘టీఆర్ఎస్’ పేరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన 14 ఏళ్ల ఉద్యమంతో ముడిపడి ఉందని పేర్కొంటూ భారత్ రాష్ట్ర సమితి కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారిక ఫిర్యాదు చేసింది. అలాగే, ఈ పేరుపై దాదాపు 600 నుంచి 700 వరకు ప్రజా అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి చేరినట్లు సమాచారం. పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కవిత పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు దక్కుతుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!