
క్రీడలు

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. నేటి కార్యక్రమాల్లో భాగంగా మోదీ ఆసియాన్-ఇండియా సదస్సు, తూర్పు ఆసియా సదస్సుల్లో పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ప్రాంతీయ సహకారం, ఉమ్మడి ప్రాధాన్య అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆసియాన్ సదస్సుకు హాజరవడం ఇది 13వసారి. వీటితో పాటు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న క్వాడ్ కూటమి నేతల ప్రత్యేక సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. ఈ భేటీల ద్వారా ప్రాంతీయ పరిణామాలు, పరస్పర సహకారంపై నేతలు చర్చించనున్నారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!