

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లిదండ్రులు సోనియాగాంధీ, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రెస్టారంట్‌ను తాను కూడా సందర్శించినట్లు వెల్లడించారు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడికి వెళ్లిన సందర్భంగా ఈ ఆసక్తికర అనుభవం ఎదురైందని చెప్పారు. దిల్లీలో సోమవారం జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ ఈ విషయాలను పంచుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కేంబ్రిడ్జ్‌కు వెళ్లినప్పుడు తనతో వచ్చిన స్నేహితురాలికి ఆ రెస్టారంట్ ప్రత్యేకత తెలియకుండా అక్కడికి తీసుకెళ్లినట్లు వివరించారు. తన తల్లిదండ్రులు అక్కడే తొలిసారి కలుసుకున్నారని రెస్టారంట్ సిబ్బందికి చెప్పగా, వారు వెంటనే గుర్తుపట్టారని తెలిపారు.
అక్కడి ఆహారం గురించి కూడా రాహుల్ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రేమలో పడాలనుకునేవారు ఆ యూనివర్సిటీ రెస్టారంట్‌కు వెళ్లవచ్చని, అయితే అక్కడి చికెన్ వంటకాన్ని మాత్రం తినవద్దని చమత్కరించారు. తన తల్లిదండ్రులకు అక్కడి భోజనం ఎంతో నచ్చిందని, కానీ తనకు మాత్రం అస్సలు నచ్చలేదని నవ్వులు పూయించారు. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు రాహుల్‌ను ఆయన ప్రియురాలు ఎక్కడున్నారని ప్రశ్నించగా, ఆమె తన స్నేహితురాలని సమాధానమిచ్చారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!