

గాంధీ జయంతి నుండి రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం విధిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనకాపల్లిలో మాట్లాడుతూ, అక్టోబర్ 2 తర్వాత ఏపీ లో ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్వినియోగం కోసం చర్యలు చేపట్టామని, గ్రామాల్లో ప్రతి ఇంటికి సరైన మరుగుదొడ్డి ఉండాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీల పనితీరును పర్యవేక్షిస్తామని, అలాగే గోదావరి నీటిని వంశధారాతో అనుసంధానం చేయాలన్న ప్రణాళికలు కూడా ఉన్నాయని తెలిపారు.
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఉన్ని గురుకుల పాఠశాలలో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడి వివిధ అంశాలపై చర్చించి, పిల్లల బంగారు భవిష్యత్తు తన బాధ్యత అని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి మరియు విద్యపై ప్రభుత్వానికి ఉన్న కట్టుబాటును సీఎం స్పష్టంగా గుర్తు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!