

భూమిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్క్‌లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పవన్ కళ్యాణ్ కోరారు. తన తల్లి అంజనా దేవి పేరిట తెల్ల పొణికి మొక్కను నాటిన ఆయన, జూన్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో సీడ్ బాల్స్ తయారీని ప్రజా ఉద్యమంగా చేపడతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, పచ్చని, ఆరోగ్యకరమైన, వాతావరణ మార్పులను తట్టుకునే ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!