

తమిళ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే మూడు భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవగా, తమిళ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బుక్ మై షోలోనే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం విజయ్ స్టార్డమ్కు నిదర్శనంగా మారింది.
అయితే తెలుగు, హిందీ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచారం మరింత వేగం పుంజుకుంటే బుకింగ్స్ పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విడుదల నాటికి ఇతర భాషల్లో కూడా స్పందన పెరుగుతుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!