

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ నవీన్ రావు పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు రెండోసారి విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన ఈ విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి నవీన్ రావుకు ఉన్న పరిచయాలు, సంబంధాలపై సిట్ అధికారులు ప్రధానంగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. విచారణ అనంతరం నవీన్ రావు మాట్లాడుతూ, గతసారి అడిగిన ప్రశ్నలనే మళ్లీ ప్రస్తావించారని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించానని, ఫోన్ ట్యాపింగ్ చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
ఈ అంశంపై స్పందించిన కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా విచారణ కొనసాగుతోందని ఆరోపించారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని పేర్కొన్న ఆయన, ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, కార్ రేసు కేసుల పేరుతో బీఆర్ఎస్ పార్టీపై దాడి జరుగుతోందని అన్నారు.
.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!