
.jpg&w=3840&q=75)
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వనున్నారనే ప్రచారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కు తమకు గౌరవం ఉందని పేర్కొంటూ, ఈ విచారణ పూర్తిగా వాస్తవాలను వెలికితీయడానికే పరిమితం కావాలని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు భాగస్వాములయ్యారనే విషయం తేలాల్సి ఉందని, 500కు పైగా ఫోన్ నంబర్లు ట్యాప్ అయ్యాయనే సమాచారం ఉందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు జరగవని స్పష్టం చేశారు. అధికారులు మాత్రమే ఈ చర్యలకు పాల్పడరని పేర్కొన్నారు. సిట్ సంపూర్ణంగా, పారదర్శకంగా విచారణ జరిపితేనే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఈ అంశంలో ప్రజలు వాస్తవాలు వెలుగులోకి రావాలని కోరుకుంటున్నారని, కేసీఆర్కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టంచేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!