
రాజకీయాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారని, ప్రజలు మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదం క్షేత్రస్థాయిలో అమలవుతోందని ఆయన కొనియాడారు. అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి చేరుతున్నాయని తెలిపారు. ఈ ఫలితాలు ఎన్డీఏను మరింత బలపరుస్తాయని, కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!