

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల అక్రమాలపై తన దృష్టిని మరింత పెంచారు. తన శాఖలతో పాటు, జనసేన ముఖ్య నేతలు కందుల దుర్గేష్ మరియు నాదెండ్ల మనోహర్ పరిధిలోని శాఖల్లో జరిగే వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, అడవి సంపద దోపిడీ, ఎర్రచందనం స్మగ్లింగ్, పంచాయతీ నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై పవన్ నిశితంగా ఫాలో అవుతున్నారు. గతంలో కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకున్నట్టు ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం పవన్ తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయనే ప్రశ్న చర్చనీయాంశమైంది.
అయితే గతంలో సోషల్ మీడియా అనుచిత పనులపై కఠిన చర్యలు తీసుకుని పలువురిని నియంత్రణలోకి తీసుకురావడంలో పవన్ సక్సెస్ కావడంతో, ఇప్పుడు కూడా అక్రమార్కులపై అదే రీతిలో దాడి చేయబోతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అధ్యయనం చేసి, ఆ తరువాతే కార్యాచరణ ప్రారంభించే పవన్ స్టైల్ దృష్ట్యా, రేషన్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వంటి వాటిపై త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!