

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడి, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, గ్రామంలోని ప్రధాన సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. రహదారి అవసరమని స్థానికులు కోరినప్పుడు, పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు.
తరువాత ఆయన ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం వద్ద ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా, పవన్ కల్యాణ్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తర్వాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆవిష్కరించారు. సుందరగిరి రోడ్డు, ఆలయ ప్రదక్షిణ నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామంలో జరుగుతున్న మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణాన్ని కూడా పరిశీలించారు.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!