
సినిమాలు

లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై భౌతిక దాడి జరిగే అవకాశం ఉందని తనకు సమాచారం అందిందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రధానికి తెలియజేయగా, తన విజ్ఞప్తిని ప్రధాని ఆమోదించినట్లు స్పీకర్ వెల్లడించారు. ప్రధాని భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానిపై దాడి చేసేందుకు విపక్ష ఎంపీలు కుట్ర పన్నారని ఓం బిర్లా ఆరోపించారు. నిన్న జరిగిన ఘటన పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా విపక్ష మహిళా ఎంపీల ప్రవర్తన గర్హనీయమని వ్యాఖ్యానించారు.
సభలో నినాదాలు చేయడం, నిరసనలు నిర్వహించడం, ప్లకార్డులు ప్రదర్శించడం కొనసాగితే సభా కార్యక్రమాలు సజావుగా సాగవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి లోక్సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని స్పీకర్ గుర్తుచేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!