
సినిమాలు

ఎం.కే. స్టాలిన్, ఎడప్పాడి కె. పళనిస్వామి కలిసి ఉన్న పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఒక అధికారిక భేటీకి సంబంధించిన వీడియో ఇదిగా తెలుస్తోంది.
“రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం ఉండవు” అనే వ్యాఖ్యలతో నెటిజన్లు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కోసం మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో సంకీర్ణ సమీకరణాలు, వ్యూహాత్మక చర్చలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!