

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది – NDA తరఫున బీహార్‌కు వెళ్తున్నది చంద్రబాబు లేదా పవన్ కాదని, నారా లోకేశ్ అని. ఇది లోకేశ్‌కు దేశవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా ఆయనపై ప్రధానమంత్రి మోదీ నమ్మకం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం కళ్యాణదుర్గం పర్యటనలో ఉన్న లోకేశ్, ఈరోజు సాయంత్రం పట్నా, బీహార్‌కు బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రం 6 గంటలకు బిజినెస్ కాన్క్లేవ్లో, 7:30కు ఇన్వెస్టర్ల మీటింగ్‌లో పాల్గొననున్నారు.
రేపు NDA తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న లోకేశ్, ఈ కార్యక్రమం ద్వారా కూటమికి బలాన్ని చాటనున్నారు.
చంద్రబాబు, పవన్ లేని సమయంలో NDA తరఫున బీహార్‌లో ప్రచార బాధ్యతలు చేపడుతున్న లోకేశ్, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా స్వతంత్ర రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!