

విశాఖ మహా నగరంగా ఏపీలో ఉంది. విశాఖ విభజన రాష్ట్రంలో కీలకంగా మారుతోంది. జాతీయ అంతర్జాతీయ సదస్సులు అన్నీ విశాఖ వేదికగా జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో విశాఖను కార్యనిర్వహణ రాజధానిగా చెబుతూ వచ్చారు. విశాఖ మీద ఫోకస్ పెట్టారు, విశాఖను రెడీ మేడ్ రాజధాని అని కూడా వైసీపీ అంటూ వచ్చింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం బయటకు ఆ మాట అనకపోయినప్పటికీ విశాఖకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. గతంలోనూ ఇపుడూ కూడా అంతర్జాతీయ సదస్సులకు విశాఖనే ఎంచుకుంటోంది. విశాఖకు ఉన్న అవకాశాలు కూడా ఆ విధంగా నగరం మీద దృష్టి నిలిపేలా చేస్తున్నాయి.
విశాఖ అంటేనే తుఫాన్లు సునామీలు అని గతంలో భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సముద్ర తీరం ఉన్న నగరాలకు ఇది సహజమైన సమస్య. ఆ మాత్రం చేత ఆ నగరాలు మేటిగా సరిసాటిగా ఎదగకుండా ఎవరూ ఈ సాకులను చూపించి ఆపింది లేదు. విశాఖకు ఇపుడు కొత్త ముప్పుగా భూకంపాలను చూపించే వారు కూడా ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున విశాఖలో అనేక చోట్ల భూమి ప్రకంపించింది. రిక్టర్ స్కేల్ మీద దాని తీవ్రత 3.7గా నమోదు అయింది. ఇది స్వల్ప భూకంపం గానే చెబుతున్నారు.
అయితే భవిష్యత్తులో భూకంపాలు విశాఖను తాకే అవకాశం ఉందా, ఉంటే ఏ స్థాయిలో అన్నది ఇపుడు అంతా చర్చగా ఉంది. దీని మీద ఆంధ్రా యూనివర్సిటీ జియో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒకరు పూర్తి స్పష్టతను ఇచ్చారు. విశాఖ సేఫ్ జోన్ లో ఉందని భూకంపాల ప్రమాదం అయితే అసలు లేనే లేదని తేల్చారు. మంగళవారం సంభవించిన స్వల్ప భూకంపం వల్ల ఏ విధమైన ప్రమాదం లేదని ఆయన చెప్పారు. విశాఖ నగరమే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లా అంతటా భూకంపాల విషయంగా తీసుకుంటే జోన్ టూలో ఉందని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల విశాఖకు భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఆయన వివరిస్తున్నారు. విశాఖ అన్ని విధాల సేఫ్ అని ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. దాంతో విశాఖ వాసులు ఏ విధంగానూ కలవరపడాల్సింది లేదని నిపుణులు అంటున్నారు.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!