
గాసిప్స్

నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) హల్చల్ చేశారు. హరిచరణ్ మార్వాడీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపేశారని, ఎన్నికల సిబ్బంది తమకు సహకరించడం లేదని ఎంపీకి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘తన్నులు తింటారు.. సంగతి చూస్తాను’ అని పోలీసులను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం పంపిన ఎంపీ అరవింద్ బీజేపీ అభ్యర్థిని బయటకు పంపిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!