
ఆరోగ్యం

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు మద్దతుగా మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి పోటీ లేకుండా నితిన్ నబీన్ ఎన్నిక ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నితిన్ నబీన్ ప్రమాణస్వీకార కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానుండటం విశేషం. నితిన్ నబీన్ ఎన్నికతో బీజేపీ నాయకత్వంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!