

నగరి మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక ప్రకటనపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి సంబంధించి వైసీపీ నేతలు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి, తమ అభ్యర్థికి సంబంధించిన ఆధారాలు, పత్రాలను అందజేశారు. వైసీపీ అభ్యర్థికి ఫామ్-7 అందించిన తర్వాత టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించడంపై వారు అభ్యంతరం తెలిపారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టులో కేసు దాఖలు చేశామని, త్వరలో విచారణ జరిగే అవకాశం ఉందని రోజా తెలిపారు. కోర్టు ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌ను వివరాలు కోరితే వాస్తవాలను అందించేందుకు వీలుగా ముందుగానే ఆధారాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె, స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత పాటించాలని, ఏకగ్రీవ ఎన్నికల ప్రకటనలో నిబంధనలను అనుసరించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై తదుపరి పరిణామాలు కోర్టు విచారణపై ఆధారపడి ఉండనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!