

“విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ప్రారంభమైన విశాఖ ఉక్కు కర్మాగారం, ఎన్డీఏ ప్రభుత్వాల సహకారంతో సంక్షోభం నుంచి బయటపడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ₹15,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందడంతో ప్లాంట్ కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి.
కేంద్రం ₹11,440 కోట్లు, ఏపీ ప్రభుత్వం ₹3,000 కోట్లు ఇవ్వడంతో ఉత్పత్తి సామర్థ్యం 48% నుంచి 80% వరకు పెరిగింది. రెండో బ్లాస్ట్ ఫర్నెస్ పునఃప్రారంభం అయి రోజుకు 16,000 టన్నులకుపైగా హాట్ మెటల్ ఉత్పత్తి అవుతోంది.
13,000 రెగ్యులర్, 15,000 కాంట్రాక్ట్ వర్కర్ల జీవనోపాధి కూడా రక్షణలో ఉంది. విద్యుత్ బకాయిలను ఈక్విటీలోకి మార్చడం, కోల్ సరఫరా నిలకడగా కొనసాగడం వంటి చర్యలు ప్లాంట్‌కు పెద్ద ఊరటనిచ్చాయి.
25 ఏళ్ల క్రితం వాజపేయి కాలంలో సహాయం చేసినట్లే, ఇప్పుడు కూడా చంద్రబాబు–పవన్ కాళ్యాణ్ కలిసి విశాఖ ఉక్కును మరింత బలపరుస్తున్నారని ఎన్డీఏ స్పష్టం చేస్తోంది.









.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!