

ఇటీవలి కాలంలో నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర స్థాయిని దాటి ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఆయన ఇమేజ్ పెరుగుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
తాజాగా ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు అక్కడి జాతీయ మీడియా ఆయన్ని ఎదురుచూసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో జాతీయ మీడియా ఒక రాష్ట్ర నేత కోసం వేచి ఉండడం చాలా అరుదు. ఇది లోకేష్ దేశవ్యాప్తంగా పొందుతున్న గుర్తింపును స్పష్టంగా చూపిస్తోంది.
బీహార్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు కూడా లోకేష్‌ను కలిసేందుకు ముందుకు వచ్చారు. కొందరు తమ ఇళ్లకు ఆహ్వానించగా, బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన వెళ్లలేకపోయారు. దాంతో, వారు పార్టీ కార్యాలయాల్లో లోకేష్‌ను కలసి సెల్ఫీలు తీసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఇక మరోవైపు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి అనుబంధంగా పనిచేసే రాజకీయ పరిశీలకుల బృందం దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలను నిరంతరం గమనిస్తుంది. ఆ బృందం తాజాగా నారా లోకేష్ బీహార్ ప్రచారం, ప్రసంగాలు, మీడియా ఇంటరాక్షన్లపై ప్రత్యేక నివేదిక సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదికను త్వరలో ప్రధానికి అందజేయనున్నారు.
ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, పీఎంవో పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా లోకేష్‌పై జాతీయ పత్రికల్లో ప్రచురితమైన వార్తా కటింగ్స్‌ను సేకరించడం ప్రారంభించింది. సాధారణంగా జాతీయ ప్రభావం ఉన్న నేతల విషయంలోనే ఆ కమిటీ ఈ రకమైన ఫాలోఅప్ చేస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, నారా లోకేష్ జాతీయ స్థాయిలో ఎదుగుదల వేగంగా సాగుతోందని, అలాగే ఆయన నాయకత్వం కొత్త దశలోకి అడుగుపెడుతోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే క్రమశిక్షణ, ఆధునికత, యువతతో అనుసంధానం విషయంలో ఆదర్శంగా నిలిచిన లోకేష్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో యువనాయకుడిగా గుర్తింపు పొందుతున్నారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!