
గాసిప్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, టీడీపీ కీలక నేత నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో హస్తినాకు చేరుకున్న అనంతరం నేరుగా పార్లమెంట్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్లతో నారా లోకేష్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ సమస్యలను ప్రస్తావించి వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
అదనంగా ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇవాళ రాత్రి ఢిల్లీలో బస చేసి, మంగళవారం ఏపీకి తిరిగి రావాలని షెడ్యూల్ ఖరారైంది. ఇటీవల రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో నారా లోకేష్ విదేశీ పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!