
సినిమాలు

ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తన సతీమణికి నోటీసులు వచ్చాయన్నది తప్పుడు ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఉన్న ఒక కంపెనీకే నోటీసులు వచ్చాయని, లిక్కర్ స్కాంపై ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. రాజ్ కెసిరెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్న వారందరికీ ఈడీ నోటీసులు వచ్చాయని చెప్పారు.
తాను, రాజ్ కెసిరెడ్డి కలిసి ఒక సైట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయాలని భావించామని, 2020–21 మధ్య దాదాపు ₹35 లక్షల లావాదేవీలు జరిగాయని ఆయన వివరించారు. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. నోటీసులకు చట్టపరంగా సమాధానం ఇస్తానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ధీమా వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!