
సినిమాలు

ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పనితీరు సరిగా లేని కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికి, కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కీలక శాఖల్లో కూడా మార్పులు ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణకు చెందిన నేతలకు కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్ పేర్లు మంత్రివర్గ రేసులో వినిపిస్తుండగా, కిషన్ రెడ్డి శాఖ మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అలాగే రాఘవ్ చడ్డాకు క్యాబినెట్ పదవి దక్కొచ్చని, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!