
సినిమాలు

ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి అస్థికలను సోమవారం కర్ణాటకలోని శ్రీరంగపట్నం వద్ద కావేరి నదిలో నిమజ్జనం చేశారు. శనివారం మైసూరులో ఆమె మరణించగా, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం మనవరాలు అప్సరతో పాటు కుటుంబ సభ్యులు, వేద గురువు రమేష్ శర్మ ఆధ్వర్యంలో తెలుగు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం నది ఒడ్డున పూజలు నిర్వహించి అనంతరం అస్థికలను కావేరి జలాల్లో కలిపారు.
ఈ సందర్భంగా జానకి సంరక్షకుడు నవీన్ మాట్లాడుతూ, గాయని చివరి కోరిక మేరకే ఆమె అస్థికలను కావేరి నదిలో నిమజ్జనం చేసినట్లు తెలిపారు. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన పలు వదంతులను ఆయన ఖండించారు. జానకిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు, ఆమె ఆస్తులు తమకు బదిలీ అయ్యాయన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఆమె జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!